ADB: స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 9 నుంచి ఎస్ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 9న నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు స్వీకరించడం, 23న తొలివిడత పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.