NLG: ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ జమియత్ ఉలేమా-ఎ-హింద్ నల్గొండ జిల్లా శాఖ బుధవారం పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. జిల్లా అధ్యక్షుడు మౌలానా ఎహసాన్ సాబ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు డీఎస్పీ శివరాం రెడ్డిని కలిశారు. రాజాసింగ్‌పై తక్షణమే FIR నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు అందజేశారు.