WGL: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని దుగ్గొండి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలపై శిక్షణ కార్యక్రమం బుధవారం మండలంలో నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని సూచించారు.