KDP: కొండాపురం మండల పరిధిలోని పొట్టిపాడు గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ప్రతాపరెడ్డి బుధవారం తెలిపారు. రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వారి నుంచి రెండు పందెం కోళ్ళు, చరవాణులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.