NLR: రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి, 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బుధవారం ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలులో ఉన్నాయో లేదో సమగ్రంగా పరిశీలించాలన్నారు.