SDPT: జిల్లాలో సర్పంచ్ ఆశావహులు సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సొంత వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని గ్రామ ఓటర్లందరిని చేర్చుకుని పోస్ట్‌లతో హడావిడి చేస్తున్నారు. ఫేస్ బుక్ పేజీ క్రియేట్ చేసి గ్రామ యువ ఓటర్లను చేర్చుకుని పోస్ట్‌లతో హంగామా చేస్తున్నారు. యూ ట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు.