KMM: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలో హమాలీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు ప్రభుత్వ పరిశ్రమలను అప్పనంగా కట్టబెడుతుందన్నారు.