నాగర్ కర్నూల్: మాజీ ఎంపీ మంద జగన్నాథంను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. మంద జగన్నాథం అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన కుమారుడు శ్రీనాథ్‌ను పలకరించి ధైర్యం చెప్పారు.