MNCL: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అమృత్ 2.0 పథకం కింద కొత్తపల్లిలో చేపట్టిన తాగునీటి పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు నిరంతరం అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.