MBNR: నూతనంగా ఎన్నికైన మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గుముల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి గురువారం జిల్లా ఎస్పీ జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో పరస్పర సహకారంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు.