NZB: మోపాల్ మండలం ముదక్పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉచితంగా HPV టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మల్ మాట్లాడుతూ.. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల ప్రతి ఆడపిల్లకు ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమన్నారు. టీకా పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.