KMM: నేను చనిపోలేదు సార్… బ్రతికే ఉన్నాను అంటూ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది ఓ వృద్ధురాలు. రఘునాథపాలెం మండలానికి చెందిన కొండ్రు రాములు రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా, ఆయన భార్య రాములమ్మ పింఛన్ కోసం దరఖాస్తు చేసిన కొండ్రు రాములమ్మను అధికారులు ఆన్లైన్లో ‘మరణించిన వ్యక్తి’గా నమోదు చేశారు. దీంతో పింఛన్తో పాటు రేషన్ బియ్యం కూడా నిలిచిపోయాయి.