నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒకవైపు వడగళ్లతో కూడిన వర్షాలు పంటను దెబ్బతీస్తుండగా, మరోవైపు అడవి పందులు, కోతులు పొలాల్లోకి చొరబడి పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధిక పెట్టుబడులు, మరోవైపు వీటి ఇబ్బందులు ఎక్కువ అవ్వడంతో, అడవి జంతువుల నుండి పంటలను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.