WGL: జూన్ 21న జరగనున్న నీట్ (UG)-2026 పునఃపరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. CKM ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.