RR: విద్యార్థుల సురక్షిత ప్రయాణం, ట్రాఫిక్ ఉపశమనానికి సైబరాబాద్ పోలీసులు భారీ అడుగు వేశారు. సీపీ రమేష్ నేతృత్వంలో 500కు పైగా విద్యాసంస్థలతో “స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్” ప్రారంభమైంది. ఆధునిక టెక్ ప్లాట్ఫామ్ ద్వారా పాఠశాలలు, తల్లిదండ్రులు, అధికారుల మధ్య సమన్వయం పెంచి ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, విద్యార్థుల భద్రత బలోపేతం చేయనున్నారు.