KMM: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని కూసుమంచి సీఐ సంజీవ్ అన్నారు. ఇవాళ కుసుమంచిలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైవేలో వెళ్తున్న భారీ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి చూపు స్పష్టంగా ఉంటే సురక్షితంగా వాహనాలు నడపొచ్చన్నారు.