VKB: రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను అసెంబ్లీ చాంబర్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభ్యర్థులిద్దరికీ స్పీకర్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, పాల్గొన్నారు.