WGL: నల్లబెల్లి మండలం గుండ్ల పహాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఈ పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చరణ్ సింగ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.