జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరండ్ల గ్రామపంచాయతీ సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ప్రజల్లో భద్రతా భావం పెరగడమే కాకుండా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.