BHNG: పోచంపల్లి మండలం గౌస్ కొండలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా షికారుకు వెళ్లి గల్లంతైన శివ అనే యువకుడి మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఆరుగురు స్నేహితులు నాటు పడవపై వెళ్తుండగా, పడవలోకి నీరు చేరడంతో ప్రమాదం సంభవించింది. ప్రాణభయంతో అందరూ నీటిలోకి దూకగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈత రాని శివ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.