PDPL: సింగరేణి RG-1లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల27 నుంచి మే21 వరకు విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తుందని యాజమాన్యం పేర్కొంది. ఫుట్ బాల్, వాలీ బాల్, బాక్సింగ్, కరాటే వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందే విద్యార్థులు, శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలంది. ఈ మేరకు GM కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.