SRPT: సూర్యాపేటలో బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నంద్ లాల్ పవార్, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ఛైర్పర్సన్ నివేదిత నివాళులర్పించారు. కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వమే లక్ష్యంగా 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు చేసిన కృషిని, ఆయన బోధించిన ‘అనుభవ మంటపం’ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.