MBNR: కోయిలకొండ మండలం చందాపూర్ గ్రామ శివారులోని గుట్టలపై గురువారం చిరుత పులి మరోసారి కనిపించి కలకలం రేపింది. గత కొంతకాలంగా కోయిలకొండ శివారు గ్రామాల్లో చిరుతలు తరచుగా కనిపిస్తున్నాయి. చిరుతల కారణంగా మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువులను తమ పొలాల వద్ద ఉంచుకోవద్దని జాగ్రత్తగా ఉండాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.