SRCL: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జనగణన చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస చారి అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో జనగణన 2027పై సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లకు ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస చారి మాట్లాడుతూ.. మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు మొదటి దశ మొదటి జనగణన ప్రారంభమవుతుందన్నారు.