SRPT: కోదాడ-మేళ్లచెరువు రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక భారీ వృక్షం పూర్తిగా ఎండిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది సిమెంట్ లారీలు, పాఠశాల బస్సులు, ద్విచక్ర వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఏ క్షణమైనా ఈ చెట్టు కూలిపోయే అవకాశం ఉన్నందున, అధికారులు తక్షణమే స్పందించి దానిని తొలగించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.