BDK: మణుగూరు ఓసీ ఘటనపై ట్విట్టర్ వేదికగా తెలంగాణ జాగృతివ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్లకవిత స్పందించారు. డంపర్ టైర్ పేలి కార్మికుడు మృతి చెందడం కలచి వేసిందని ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడటం బాధాకరమని అన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవటం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు.