MDK: నిజాంపేట మండలం జడ్చెరువు తండాలో గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహర్నిశలు శ్రమించి పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లభించక కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం కష్టపడినా పెట్టుబడి కూడా రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించి, తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.