KNR: సైదాపూర్ పురుషుల పొదుపు సమితి సభ్యులు కొంకటి రాజు, గడిపే సంపత్ మృతితో వారి కుటుంబాలకు బీమా నగదు అందజేశారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజు తల్లి సరోజనకు రూ.98,552, సంపత్ భార్య రజితకు రూ.89,528 నగదును సమితి అధ్యక్షుడు రవీందర్ గౌడ్ పంపిణీ చేశారు. సామూహిక నిధి, అభయనిధి కింద ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.