BDK: మణుగూరు మండలం పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూలిపోయిన వంతెనను పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన ప్రజావాణి, ప్రజాదర్భ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. వైద్య సేవల కోసం ఇదే రహదారిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.