WNP: ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో రేపు (గురువారం) మండల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీపాద తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభల్లో సేకరించిన పథకాల అమలు, లబ్ధిదారుల అభిప్రాయాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, వార్డు సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.