MBNR: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన నవాబ్‌పేట మండలం కాకరజాల శివారులోని ఉడిత్యాల పెద్ద చెరువులో చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం.. దేపల్లి గ్రామానికి చెందిన జావిద్ అదే గ్రామానికి చెందిన బుచ్చయ్యతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జావిద్ చెరువులో మునిగిపోవడంతో స్థానికులకు సమాచారం అందించారు.