SRD: సిర్గాపూర్ మండలానికి చెందిన విద్యార్థి గైని ఉదిత్ వర్మ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. నల్లవాగు గురుకులంలో బైపీసీ చదువుతున్న ఉదిత్ వర్మ 1000 మార్కులకు 875 మార్కులు సాధించాడు. కుమారుడి విజయంతో తల్లిదండ్రులు గైని నరసింహులు, సావిత్రి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదిత్ వర్మను గురుకుల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.