NLG: కుమ్మరులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కుమ్మర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కుమ్మరి సంఘం జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తాడూరి చంద్రం విజ్ఞప్తి చేశారు. చిట్యాల మండలం వనిపాకలలో సోమవారం జరిగిన సమావేశానికి విచ్చేసి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో కుమ్మరులను చైతన్యవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.