సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి సోమవారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శనివారం నియామకం కావడంతో వేం నరేందర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆంక్షా రెడ్డి వెంట గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు.