BDK: ఇల్లందు పట్టణం లేబర్ అడ్డా వద్ద గురువారం పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇల్లందు ఎస్సై సారంగపాణి మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. భవిష్యత్తుపై లక్ష్యంతో సామాజిక సేవ వైపు సాగాలని కోరారు. ఈ కార్య క్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.