WNP: విద్యా మరియు సాహిత్య రంగాల్లో చేసిన విశేష కృషికి గాను వనపర్తికి చెందిన పలుస శంకర్ గౌడ్ కు శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘దక్షిణ భారతదేశ స్ఫూర్తి అవార్డు’ లభించింది. హైదరాబాద్ బిర్లా ప్లానెటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఎటికాల పురుషోత్తం, సీనీ నటుడు పృథ్వీరాజ్ తదితరుల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.