KNR: శంకరపట్నం మండలం గొల్లపల్లి, కొత్తగట్టు గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా 440 పశువులకు టీకాలు వేశారు. పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తపై పశు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్య రక్షణకు ఇటువంటి టీకా కార్యక్రమాలు కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాడి రైతులు పాల్గొన్నారు.