HYD: నూరుద్దీన్ ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో మంగళవారం సైన్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఎగ్జిబిషన్లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొని, విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులు చదువుతోపాటు ఇతర నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. నైపుణ్యంతోనే ఉజ్వల భవిత సాధ్యమని విద్యార్థులకు సూచించారు.