MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఏప్రిల్ 2న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ సూచించారు. గురువారం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2న ప్రత్యేక గ్రామ సభలను ఏర్పాటు చేసి సమస్యలను గుర్తించాలన్నారు.