JGL: 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వెల్గటూర్ మండలం కోటిలింగాల దేవస్థానం వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు పరిశీలించారు. దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ట్ మాధవి దేవాలయాన్ని సందర్శించి ఘాట్ల పరిస్థితిని పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన పనులపై సూచనలు ఇచ్చారు. అసిస్టెంట్ ఇంజినీర్ సంతోశ్, ఈవో ఉన్నారు.