NZB: PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వరను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి 4వ టౌన్ స్టేషన్‌కు తరలించారు. HYDలో జరిగే నిరుద్యోగ జేఏసీ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ ముందస్తు అరెస్ట్ చేశారని IFTU నగర కార్యదర్శి శివకుమార్ మండిపడ్డారు. నీలం రామచంద్రయ్య భవన్ వద్ద జరిగిన ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.