NLG: చిట్యాల పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న (సోమవారం) ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు కమిషనర్ గురులింగం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ సభ్యులు ఓటింగ్ ద్వారా కో-ఆప్షన్ (4) సభ్యులను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.