NZB : భీమగల్ పట్టణంలో NSUI ఆధ్వర్యంలో 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. NSUI జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్పర్సన్ బొదిరె నాగమణి స్వామి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి విభాగం బలోపేతానికి యువత కృషి చేయాలన్నారు.