SRD: పటాన్చెరు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 45 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.20.81 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తోందన్నారు.