ADB: సాత్నాల మండలంలోని సైదేపూర్ చెరువు పునరుద్ధరణ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పునరుద్ధరణతో స్థానిక రైతులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. దీంతో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.