NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలో పోలీసులు యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనుమంత్ రెడ్డి యువకులతో రోడ్డు నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. సురక్షిత ప్రయాణం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక యువత పాల్గొన్నారు.