కామారెడ్డి పట్టణానికి చెందిన అబ్దుల్ ఫకీర్(60) సోమవారం లింగాపూర్ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన 108 సిబ్బంది అతన్ని రక్షించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈఎంటీ యాదగిరి, పైలట్ సుదర్శన్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.