ప్రకాశం: కనిగిరి పట్టణంలోని బొడ్డుచాడు వద్ద శ్రీరామనవమి పండగ సందర్భంగా ఇవాళ సీతారాముల స్వామివారికి కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రాంత ప్రజల సుఖశాంతులు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.