VKB: హిందువులు పవిత్రంగా భావించే గోమాతకు జాతీయ ప్రాణి హోదా కల్పించాలని గోమాత ప్రచార కమిటీ సభ్యులు రాజు నాయక్ డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 27న గో ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసే కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం ముమ్మారంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.