MHBD: తొర్రూరు మున్సిపాలలోని 6వ వార్డు నుండి కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి చెందిన రాయిశెట్టి మానస యాకేందర్ను శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమెకు మనోధైర్యం నింపుతూ.. మేమున్నాం, అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. భవిష్యత్తులో బలమైన మహిళ నాయకురాలుగా ముందుకు సాగాలని పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.